కీర్తనలు త్యాగరాజు లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి - లావణ్య నిధిమతి
భైరవి - ఆది
పల్లవి:
లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి
లావణ్య నిధిమతి ॥లలితే॥
అను పల్లవి:
తెలివిని వర్ధిల్లు శ్రీ - తపస్తీర్థ నగర నిలయె ॥లలితే॥
చరణము(లు):
తెలియని బాలుఁడగాదా అంబ
తెలివి నా సొమ్ముగాదా
చలము సేయ మరియాదా
చల్లని మాటలు బల్కరాదా ॥లలితే॥
బ్రోచువా రిలను లేక
జూచిజూడక పరాకా
యీ సుజనుల వేడగ లేక
నే దాసుఁడ నీవే గతిగాక ॥లలితే॥
కన్నతల్లి శుభవదనె మీ
యన్న దయకు పాత్రుడనె
తిన్నగ శరణు జొచ్చితినే
త్యాగరాజ మానస సదనె ॥లలితే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - lalitee! shriipravR^iddhee! shriimati - laavaNya nidhimati ( telugu andhra )