కీర్తనలు త్యాగరాజు లాలి లాలీయని యూచేరా వన
హరికాంభోజి - దేశాది
పల్లవి:
లాలి లాలీయని యూచేరా వన
మాలి మాలిమితోఁ జూచేరా ॥లా॥
చరణము(లు):
దేవ దేవయని బిలిచేరా మహాను
భావ భావమునఁ దలచేరా ॥లా॥
రామ రామ యని బలికేరా ని
ష్కామ కామరిపునుత రారా ॥లా॥
కోరి కోరి నినుఁ గొలిచేరా మాయా
దారి దారి సద్భజనేరా ॥లా॥
రాజ రాజ యని పొగడేరా త్యాగ
రాజ రాజ యని మ్రొక్కేరా ॥లా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laali laaliiyani yuucheeraa vana ( telugu andhra )