కీర్తనలు త్యాగరాజు లాలియూగవే మా - పాలిదైవమా
నీలాంబరి - రూపకము
పల్లవి:
లాలియూగవే మా - పాలిదైవమా ॥లా॥
అను పల్లవి:
లాలియూగవే నును - గాలిదిండి పాన్పుపైని ॥లా॥
చరణము(లు):
పమ్మిన వేడుకమీఱ తమ్ములతోను
కమ్మనివిడె మొసఁగు యా జనకాత్మజతోను ॥లా॥
బొమ్మదేవరతండ్రి భూమీశులతోడను
సమ్మతమున త్యాగరాజు సన్నుతి సేయఁగ ॥లా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laaliyuugavee maa - paalidaivamaa ( telugu andhra )