కీర్తనలు త్యాగరాజు లేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో?
నవనీత - ఆది
పల్లవి:
లేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో? ॥లేమి॥
అను పల్లవి:
ఆ మహిమ లెల్ల మాని యీ మహిలోఁ బుట్టిరో ॥లేమి॥
చరణము(లు):
నీ రూపమునుఁ బూని మనసు నిర్మలులై యుండలేదా
ధారాధరాభ శరీర త్యాగరాజ వినుత ॥లేమి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - leemi.r delpa.r bedda levaru leeroo? ( telugu andhra )