కీర్తనలు త్యాగరాజు లోకావన చతుర! పాహి మాం
బేగడ - ఆది
పల్లవి:
లోకావన చతుర! పాహి మాం ॥లోకావన॥
అను పల్లవి:
సాకేతాధిప సరస గుణాప్రమేయ సరసిజాసన
సనందన వందితాంఘ్రి యుగ పద నిర్జిత ముని శాప ॥లోకావన॥
చరణము(లు):
రాకాబ్జముఖ పరాకా చెంతకు
రాక తనకోర్వ తరమా పాకారి వినుత
నీకాశించితి గాక నే నన్య మెంచను
నీదు వాఁడనయ్య రామయ్య ॥లోకావన॥
నీలాకృతి గల నీ లావణ్యము
నీలాగని కనిపింపవే బాలార్కాభ సు
చేలావృత నన్నేలుకో మనసు రాదిక
తాళజాల న్యాయామారామ ॥లోకావన॥
చాపాదిక పరి రూపాలను గొను
చాపాలంకృత సుందర అవనీ పాద్భుతమగు
నీ పాదము గతి శ్రీపతే వర
ద పాలిత త్యాగరాజ సార్వభౌమాఖిల ॥లోకావన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - lookaavana chatura! paahi maaM ( telugu andhra )