కీర్తనలు త్యాగరాజు వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా
స్వరభూషణి - రూపక
పల్లవి:
వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా వ..
అను పల్లవి:
సురలు మునులు భూసురులు చుట్టి చుట్టి సేవించే వ..
చరణము(లు):
వరగిరి వైకుంఠమట వర్ణింపఁదరముగాదట
నిర్జనులకు తారకములలోఁ జంద్రుఁడై
మెఱయుఁదువట వర త్యా
గరాజనుత గరుడసేవఁ జూడ వ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varadaraaja! ninu.r goori vachchiti mrokkeeraa ( telugu andhra )