కీర్తనలు త్యాగరాజు వరదా! నవనీతాశ! పాహి, వరదానవ మదనాశా! ఏహి
రాగపంజరం - చాపు
పల్లవి:
వరదా! నవనీతాశ! పాహి
వరదానవ మదనాశా! ఏహి ॥వరదా॥
అను పల్లవి:
శరదాభ! కరధృత శరా
శర దాశుగ! సుమశరదాశ రహిత! ॥వరదా॥
చరణము(లు):
ద్విరదాద్భుతగమన! పురదహననుత!
స్ఫురదాభరణా! జరావనపర!
గరదాశన తురగరథా! ద్యుతిజిత
వరదాస జనాగ్రేసర త్యాగరాజ ॥వరదా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varadaa! navaniitaasha! paahi, varadaanava madanaashaa! eehi ( telugu andhra )