కీర్తనలు త్యాగరాజు వరాలందుకొమ్మని నాయందు వంచన సేయ న్యాయమా?
ఘుర్జరి - ఆది
పల్లవి:
వరాలందుకొమ్మని నాయందు
వంచన సేయ న్యాయమా? ॥వ॥
అను పల్లవి:
సురాసురవినుత! రామ! నా మన
సు భక్తినిఁ గోరి యుండగ నను ॥వ॥
చరణము(లు):
మనమున నిజముగ నమ్మిన వారి
మనసు కొంచ ఫలమాశించగ రా
దనుచు - ఘనుని జేసిన నీ బిరుదుకు
కనక కశిపు సుతుఁడు సాక్షి గాదా? ॥వ॥
అవివేకముతో దెలిసి తెలియకను
భవసుఖముల కాశించిన గాని
ధ్రువమైన ఫలమొసంగు నీ శక్తికి
ధ్రువుఁడు సాక్షిగాదా? రామ నను ॥వ॥
చరాచరాత్మక! సురపూజిత! యిక
పరాకులేకయు సతతము నీ ద
య రావలె ననుచు కోరి శ్రీ త్యా
గరాజునిపై గృపలేక నను ॥వ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varaalaMdukommani naayaMdu vaMchana seeya nyaayamaa? ( telugu andhra )