కీర్తనలు త్యాగరాజు వాచామగోచరమె మనసా
కైకవశీ - దేశాది
పల్లవి:
వాచామగోచరమె మనసా
వర్ణింపఁదరమె రామమహిమ ॥వా॥
అను పల్లవి:
రేచారి మారీచుని బడఁగఁ గొట్టి
రెండోవాని శిఖి కొసఁగెనే ॥వా॥
చరణము(లు):
మానవతీ మదినెఱింగి చా
మర మౌటకస్త్రమునేయఁ గని
మానంబుకై మెడదాచగ
మాధవుండు గని కరఁగి వేగమె
దీనార్తి భంజనుఁడై ప్రాణ
దానం బొసఁగ మున్ను చనిన
బాణంబు నటు చెదరసేయలేదా
గానలోల త్యాగరాజ నుత మహిమ ॥వా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vaachaamagoocharame manasaa ( telugu andhra )