కీర్తనలు త్యాగరాజు వాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే
కల్యాణి - ఆది
పల్లవి:
వాసుదేవ యని వెడలిన యీ దౌవారికుని గనరే వా..
అను పల్లవి:
వాసవాది సురపూజితుఁడై
వారిజనయనుని మదినిదలఁచుచును వా..
చరణము(లు):
నీరుకావి దోవతులను గట్టి
నిటలమునను శ్రీచూర్ణముఁ బెట్టి
నారి వెడలి యీ సభలోఁ జుట్టి
సారెకు బంగరు కోలను బట్టి వా..
మాటిమాటికిని మీసము దువ్వి
మన్మథరూపుఁడు తానని క్రొవ్వి
దాటి దాటి పడుచును తానివ్వి
ధంబునఁ బలుకుచు పకపక నవ్వి వా..
బాగుమీర నటనము చేయుచును
పతితపావనుని తా వేఁడుచును
రాగతాళగతులను బాడుచును
త్యాగరాజసన్నుతుని బొగడుచును వా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vaasudeeva yani veDalina yii dauvaarikuni ganaree ( telugu andhra )