కీర్తనలు త్యాగరాజు విదులకు మ్రొక్కెద సంగీత కో
మాయామాళవగౌళ - దేశాది
పల్లవి:
విదులకు మ్రొక్కెద సంగీత కో వి..
అను పల్లవి:
ముదమున శంకరకృతసామ నిగమ
విదులకు నాదాత్మక సప్తస్వర వి..
చరణము(లు):
కమలాగౌరీ వాగీశ్వరీ విధి గరుడధ్వజ శివనారదులు
అమరేశ భరత కాశ్యప చండీ శాంజనేయ గుహ గజముఖులు
సుమృకండుజ కుంభజ తుంబురు వరసోమేశ్వర శార్ఙ్గదేవ నందీ
ప్రముఖులగు త్యాగరాజ వంద్యులకు
బ్రహ్మానంద సుధాంబుధి మర్మ వి..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vidulaku mrokkeda saMgiita koo ( telugu andhra )