కీర్తనలు త్యాగరాజు వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
మధ్యమావతి - ఆది
పల్లవి:
వినాయకుని వలెను బ్రోవవే, నిను
వినా వేల్పు లెవరమ్మ? ॥వినాయకుని॥
అను పల్లవి:
అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమో
చని శంకరి జనని ॥వినాయకుని॥
చరణము(లు):
గరాధములకును వరాలొసగనుం
డరాములై భూసురాది దేవత
లు రాయడిని జెందరాదు దయ జూ
డరాదా కాంచీపురాది నాయకి ॥వినాయకుని॥
పితామహుఁడు జనహితార్థమై ని
న్ను తా తెలియ వేడ తాళిమిగల య
వతార మెత్తె యికను తామసము సే
య తాళజాలము నతార్తి హారిణి ॥వినాయకుని॥
పురాన దయచే గిరాలు మాకుని
కి రాజేసి బ్రోచు రాజధరి త్యా
గరాజుని హృదయ సరోజ మేలై
న సోదరి పరాశక్తి నను ॥వినాయకుని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vinaayakuni valenu broovavee, ninu vinaa veelpu levaramma? ( telugu andhra )