కీర్తనలు త్యాగరాజు వేణుగానలోలుని గన, వేయి కన్నులు కావలెనే
కేదారగౌళ - రూపకం
పల్లవి:
వేణుగానలోలుని గన, వేయి కన్నులు కావల నే ॥వేణు॥
అను పల్లవి:
అలి వేణులెల్ల దృష్టి చుట్టి
వేయుచు మ్రొక్కుచు రాగ ॥వేణు॥
చరణము(లు):
వికసిత పంకజ వదనలు వివిధ గతుల నాడగ
నొకరి కొకరు కరమున నిడి యోరకనుల జూడగ
శుకరవములు గల తరుణులు సొగసుగాను బాడగ
సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చు ॥వేణు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - veeNugaanalooluni gana, veeyi kannulu kaavalenee ( telugu andhra )