కీర్తనలు త్యాగరాజు శరశరసమరైకసూర శరధిమదవిదార
కుంతలవరాళి - ఆది
పల్లవి:
శరశరసమరైకసూర శరధిమదవిదార శ..
అను పల్లవి:
సురరిపు మూలబల మనుదూల
గిరుల కనలసమమౌ శ్రీరామ శ..
చరణము(లు):
తొలిఁజేసిన పాపవన కుఠారమా
కలనైన సేయఁగ లేని
బలువిలును విఱచి వెలసిన శ్రీరఘు
కులవర బ్రోవుము త్యాగరాజనుత శ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sharasharasamaraikasuura sharadhimadavidaara ( telugu andhra )