కీర్తనలు త్యాగరాజు శివశివ యనరాదా ఓరీ
పంతువరాళి - ఆది
పల్లవి:
శివశివ యనరాదా ఓరీ శివ..
అను పల్లవి:
భవభయబాధల నణచుకోరాదా శివ..
చరణము(లు):
కామాదుల దెగకోసి పర
భామల పరుల ధనముల రోసి
పామరత్వము నెడబాసి అతి
నీమముతో బిల్వార్చన జేసి శివ..
సజ్జనగణముల గాంచి ఓరి
ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించి తన
హృజ్జలజమునను తా పూజించి శివ..
ఆగమముల నుతియించి బహు
బాగులేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరి
త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shivashiva yanaraadaa oorii ( telugu andhra )