కీర్తనలు త్యాగరాజు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా
జగన్మోహిని - రూపకము
పల్లవి:
శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా ॥శో॥
అను పల్లవి:
నాభి హృత్కంఠ రసన నాసాదులయందు ॥శో॥
చరణము(లు):
ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున
సుర భూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో ॥శో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shoobhillu saptasvara suMdarula bhajiMpavee manasaa ( telugu andhra )