కీర్తనలు త్యాగరాజు శ్రీ నారసింహ మాం పాహి
ఫలరంజని - దేశాది
పల్లవి:
శ్రీ నారసింహ మాం పాహి
క్షీరాబ్ది కన్యకారమణ శ్రీ..
అను పల్లవి:
దీనార్తి నివారణ భవ్యగుణ
దితితనయ తిమిరసూర్య త్రినేత్ర శ్రీ..
చరణము(లు):
ప్రహ్లాదపరాశరనారదహృత్‌
పంకేరుహ నీరజబంధో
ఆహ్లాదకరాశుభ రోగ సంహార
వరద త్యాగరాజాది వినుత శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shrii naarasiMha maaM paahi ( telugu andhra )