కీర్తనలు త్యాగరాజు శ్రీకాంత నీయెడ బలాతిబల చెలంగఁగ లేదా వాదా
భవప్రియ - దేశాది
పల్లవి:
శ్రీకాంత నీయెడ బలాతిబల చెలంగఁగ లేదా వాదా శ్రీ..
అను పల్లవి:
పాకారినుత నీవారి బలాబలమును దెలియగలేదేమి శ్రీ..
చరణము(లు):
కాకదైత్యు నేకశరీరమున నేయ
కంజజాస్త్రమై బరగలేదా
శ్రీకరద్విజులై దారెరుంగలేని
చింత నీకుఁ దోచదేమి త్యాగరాజనుత శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriikaaMta niiyeDa balaatibala chelaMga.rga leedaa vaadaa ( telugu andhra )