కీర్తనలు త్యాగరాజు శ్రీపతే! నీ పద చింతన జీవనము
నాగస్వరావళి - ఆది
పల్లవి:
శ్రీపతే! నీ పద
చింతన జీవనము ॥శ్రీపతే॥
అను పల్లవి:
నే పరదేశి నా గాసి
బాపవే చనువున దయ జేసి ॥శ్రీపతే॥
చరణము(లు):
రాజాధిరాజ! రవికోటి తేజ!
పూజించి నిన్నింద్రాదులు ది
గ్రాజులై వెలయ లేదా!
రాజిల్లు శ్రీ త్యాగరాజునికి ॥శ్రీపతే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriipatee! nii pada chiMtana jiivanamu ( telugu andhra )