కీర్తనలు త్యాగరాజు శ్రీమానినీ మనోహర, చిరకాలమైన మాట యొకటిరా
పూర్ణషడ్జము - దేశాది
పల్లవి:
శ్రీమానినీ మనోహర
చిరకాలమైన మాట యొకటిర
వేమారు బల్క జాలరా ॥శ్రీ॥
అను పల్లవి:
శ్రీమంతులౌ నీ సోదరులు
జేయు రీతి పాద సేవ కోరితిని ॥శ్రీ॥
చరణము(లు):
ధర్మాద్యఖిల పురుషార్థములు
దాశార్హుని రూపమబ్బిన
మర్మంబు వేరె యున్నది
మన్నింపుమిక త్యాగరాజనుత ॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriimaaninii manoohara, chirakaalamaina maaTa yokaTiraa ( telugu andhra )