కీర్తనలు త్యాగరాజు శ్రీరఘువర సుగుణాలయ
భైరవి - ఆది
పల్లవి:
శ్రీరఘువర సుగుణాలయ
సరసిజలోచన విరోచనాభ ॥శ్రీ॥
చరణము(లు):
తరానలేని పరాకులేటికి
బిరాన ననుఁ బ్రోవఁగరాదా వాదా ॥శ్రీ॥
కమలాహిత నత కమలాహిత ధర
మమతఁదెలిసి నను మన్నించరాదా ॥శ్రీ॥
కలశజలధిలో లక్ష్మితోనాడే
కలకాలమున నీ సేవరాఁజేసే
నామనసెఱింగి బల్కు మిఁకను ॥శ్రీ॥
కనికరమున ననుకని కరమున నిడి చనువున నొక
మనవిని బల్కరాదా ॥శ్రీ॥
ఆగమమూల అవనిజాలోల
వేగమే దెలిసికో త్యాగరాజార్చిత ॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraghuvara suguNaalaya ( telugu andhra )