కీర్తనలు త్యాగరాజు శ్రీరామ జయరామ శృంగారరామ యని - చింతింపరాదె ఓ మనసా
యదుకులకాంభోజి - జంప (దివ్యనామము)
శ్రీరామ జయరామ శృంగారరామ యని - చింతింపరాదె ఓ మనసా ॥శ్రీ॥
తళుకుఁ జెక్కుల ముద్దుఁబెట్టు కౌసల్య మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
దశరథుఁడు శ్రీరామ రారయని బిలువ మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
తనివారఁ బరిచర్య సేయ సౌమిత్రి మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
తనవెంటఁ జనఁ జూచి యుప్పొంగ కౌశికుఁడు - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
తాపం బణఁగి రూపవతి యౌట కహల్య - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
ధర్మాత్మ చరణంబు సోక శివచాపమును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
తనతనయ నొసఁగి కనులారఁ గన జనకుండు - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
దహరంబు కరుగ కరమును బట్ట జానకి - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraama jayaraama shR^iMgaararaama yani - chiMtiMparaade oo manasaa ( telugu andhra )