కీర్తనలు త్యాగరాజు శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే
అమృతవాహిని - ఆది
పల్లవి:
శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే ॥శ్రీరామ॥
అను పల్లవి:
వారిజభవ సనక సనందన
వాసవాది నారదు లెల్ల పూజించు ॥శ్రీరామ॥
చరణము(లు):
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరుని రాల్చగ
శూర! అహల్యను జూచి బ్రోచితివి
యారీతి ధన్యు సేయవే త్యాగరాజగేయ! మా ॥శ్రీరామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraama paadamaa! nii kR^ipa jaalunee chittamunaku raavee ( telugu andhra )