కీర్తనలు త్యాగరాజు సంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా
సాళగభైరవి - దేశాది
పల్లవి:
సంగీత శాస్త్రజ్ఞానము
సారూప్య సౌఖ్యదమే మనసా ॥సంగీత॥
అను పల్లవి:
శృంగార రసాద్యఖిల సార పూ
రిత రామ కథా నందాది యుత ॥సంగీత॥
చరణము(లు):
ప్రేమమీర సుగుణ వాత్సల్యము
శ్రీమద్రమా వర కటాక్షము
నేమ నిష్ఠ యశో ధనము గల్గునే
నేర్పు గల్గు త్యాగరాజు నేర్చిన ॥సంగీత॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saMgiita shaastraGYaanamu, saaruupya saukhyadamee manasaa ( telugu andhra )