కీర్తనలు త్యాగరాజు సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా
ధన్యాసి - దేశాది
పల్లవి:
సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా ॥సం॥
అను పల్లవి:
భృంగి నటేశ సమీరజ ఘటజ మ
తంగ నారదాదు లుపాసించే ॥సం॥
చరణము(లు):
న్యాయాన్యాయము దెలుసును జగములు
మాయామయమనె దెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించే
కార్యము దెలుసును త్యాగరాజునికే ॥సం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saMgiitaJNaanamu bhaktivinaa sanmaargamu galade manasaa ( telugu andhra )