కీర్తనలు త్యాగరాజు సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య
రామప్రియ - దేశాది
పల్లవి:
సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య ॥సందేహమును॥
అను పల్లవి:
నందార్చిత పరయుగములు మేలో
నాగరీకమగు పాదుకా యుగంబులు మేలో ॥సందేహమును॥
చరణము(లు):
వర మౌనులెల్ల చరణంబులను
స్మరియింప నీవు వర మొసంగక
భరతార్చనచే పాదుకలు
ధరణి నిన్నొసగె త్యాగరాజ భాగ్యమా ॥సందేహమును॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saMdeehamunu diirpumayya, saakeeta nilaya, raamayya ( telugu andhra )