కీర్తనలు త్యాగరాజు సనాతన పరమపావన ఘనాఘనవర్ణ కమలానన
ఫలమంజరి - దేశాది
పల్లవి:
సనాతన పరమపావన ఘనాఘనవర్ణ కమలానన స..
అను పల్లవి:
తనవాఁడనే యభిమానము దైవమైన నీకేల కలుగదు స..
చరణము(లు):
రాజాధిపాన్వయ సాగరరాజు నీవై విలసిల్లి తే
తేజరిల్లఁగా కృపఁ జూతువె ఈ జగాన త్యాగరాజసన్నుత స..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sanaatana paramapaavana ghanaaghanavarNa kamalaanana ( telugu andhra )