కీర్తనలు త్యాగరాజు సరసీరుహాసన రామ సమయము బ్రోవ చిద్ఘన
ముఖారి - దేశాది
పల్లవి:
సరసీరుహాసన! రామ!
సమయము బ్రోవ చిద్ఘన! ॥సరసీ॥
అను పల్లవి:
పరభామల నాశించి యన్న మిడి
పగలు రేయి సరసమాడు వారినొల్ల ॥సరసీ॥
చరణము(లు):
బ్రాహ్మణీకము బాయు నీచుల
బ్రతుకాయె నదిగాక యీ కలిలో
బ్రహ్మమైన మాటల నేర్చుకొని
బరగెదరయ్యా త్యాగరాజనుత! ॥సరసీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sarasiiruhaasana raama samayamu broova chidghana ( telugu andhra )