కీర్తనలు త్యాగరాజు సరియెవ్వరే శ్రీ జానకి నీ
శ్రీరంజని - దేశాది
పల్లవి:
సరియెవ్వరే శ్రీ జానకి నీ స..
అను పల్లవి:
పరమాత్మునికై గడదేరి సదా
సిరులిచ్చుటకు చేరి గొలిచిన నీ స..
చరణము(లు):
వనమందు భయంకరమైన తా
వున నిల్తునని మనసుఁ దెలిసి
కనకాంగి యందందున రాజసుఖం
బును కల్గఁజేసితెవె త్యాగరాజనుత స..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sariyevvaree shrii jaanaki nii ( telugu andhra )