కీర్తనలు త్యాగరాజు సాకేత నికేతన సాకే ననఁగలేదా
కన్నడ - రూపక
పల్లవి:
సాకేత నికేతన సాకే ననఁగలేదా సా..
అను పల్లవి:
నీకే మరులైతిని నీకేల ఈ గుణము సా..
చరణము(లు):
రాకేందుముఖ ఇంతపరాకేమి నెనరున నీ
రాకే మిగుల కోరితిరా కేశిహరణ
రాకేమైన చెప్పకురా కేకలు వేతురు
రా కేశవ శ్రీత్యాగరాజనుత శుభచరిత సా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saakeeta nikeetana saakee nana.rgaleedaa ( telugu andhra )