కీర్తనలు త్యాగరాజు సాక్షిలేదనుచు సాధింపకే
బంగాళ - దేశాది
పల్లవి:
సాక్షిలేదనుచు సాధింపకే
సత్యసంధ సద్భక్తపాలక సా..
అను పల్లవి:
వీక్షకాదులెల్ల నవ్వరా జగత్‌
సాక్షివంశ నీరధి పూర్ణచంద్ర సా..
చరణము(లు):
శక్తి నీయెడ నిండారలేదా పరా
శక్తి బ్రోవలేదా విషయమందు వి
రక్తి కల్గు శ్రీ త్యాగరాజుని నిజ
భక్తి నీ వెఱుఁగలేవ మానవుల సా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saaxileedanuchu saadhiMpakee ( telugu andhra )