కీర్తనలు త్యాగరాజు సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి
లలిత - రూపకము
పల్లవి:
సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి ॥సీ॥
అను పల్లవి:
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥
చరణము(లు):
పరమేశ వశిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనసా ॥సీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitamma maayamma shriiraamu.rDu maataMDri ( telugu andhra )