కీర్తనలు త్యాగరాజు సీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా
కమాస్‌ - దేశాది
పల్లవి:
సీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా ॥సీ॥
అను పల్లవి:
వాతాత్మాజాదుల చెంతనే - వర్ణించిన నీపలుకులెల్ల ॥సీ॥
చరణము(లు):
ప్రేమఁజూచి నాపై పెద్ద మనసుఁజేసి
నీ మహిమలెల్ల నిండారఁ జూపి
ఈ మహిని భయమేటి కన్నమాట
రామచంద్ర త్యాగరాజ వినుత ॥సీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaapatii naamanasuna - siddhaaMtamani yunnaanuraa ( telugu andhra )