కీర్తనలు త్యాగరాజు సీతావర సంగీత జ్ఞానము
దేవగాంధారి - దేశాది
పల్లవి:
సీతావర సంగీత జ్ఞానము
ధాత వ్రాయవలెరా రామసీ..
అను పల్లవి:
గీతాద్యఖిలోపనిషత్సార
భూత జీవన్ముక్తుడౌటకు సీ..
చరణము(లు):
ఆకాశ శరీరము బ్రహ్మమనే
ఆత్మారాముని తా సరి జూచుచు
లోకాదులు చిన్మయమనే సుస్వర
లోలుడౌ త్యాగరాజ సన్నుత సీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaavara saMgiita j~naanamu ( telugu andhra )