కీర్తనలు త్యాగరాజు సుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర
బేగడ - రూపక
పల్లవి:
సుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర సుం..
అను పల్లవి:
సందడియని ఇందుముఖి జాలము వద్దమ్మ త్రిపుర సుం..
చరణము(లు):
బాలే పాలితసురజాలే గమనజిత మ
రాళే స్వకృతాఖిలలీలే తిలకాంకిత
ఫాలే నీ భక్తియు మేలే నీ దయ రా
దేలే తల్లి త్రిపుర సుం..
వాణీ వినుతే శుకపాణీ వరశేష
వేణీ లలితే కల్యాణీ సాంబశివుని
రాణీ మాధుర్యవాణీ నమ్మితిఁ బూ
బోణీ తల్లి త్రిపుర సుం..
వారీశస్తుతగంభీరే యాదిపుర వి
హారీ దీనజనాధారీ నగరాజ కు
మారీ దుష్కర్మవిదారీ త్యాగరాజు
కోరియున్న త్రిపుర సుం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suMdari nanniMdariloo.r juuchi broovavamma tripura ( telugu andhra )