కీర్తనలు త్యాగరాజు సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ
చక్రవాక - రూపక
పల్లవి:
సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ సు..
అను పల్లవి:
వగలెఱుంగలేక ఇటు వత్తువనుచు దురాసచే సు..
చరణము(లు):
స్నానాది సుకర్మంబులు వేదాధ్యయనంబు లెఱుఁగ
శ్రీనాయక క్షమియించుము శ్రీ త్యాగరాజవినుత సు..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suguNamulee cheppukoMTi suMdara raghuraama ( telugu andhra )