కీర్తనలు త్యాగరాజు సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ
శ్రీరంజని - రూపకము
పల్లవి:
సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ
జొక్కఁజేయు ధీరుఁడెవఁడో ॥సొ॥
అను పల్లవి:
నిగమ శిరోర్థము గల్గిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో ॥సొ॥
చరణము(లు):
యతివిశ్రమ సద్భక్తి వి
రతిద్రాక్షారస నవరసయుత
కృతిచే భజియించే
యుక్తి త్యాగరాజుని తరమా శ్రీరామ ॥సొ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sogasugaa mR^idaMgataaLamu jataguurchi ninu.r ( telugu andhra )