కీర్తనలు త్యాగరాజు హరియనువారి సరి యెవ్వరే
తోడి - ఆది (దివ్యనామము)
పల్లవి:
హరియనువారి సరి యెవ్వరే ॥హ॥
అను పల్లవి:
పలువిధముల తలపుల రోసి
నిలువరమగు భక్తియుఁ జేసి
మలయని మతభేదముఁ గోసి ॥హ॥
చరణము(లు):
కరఁగుచు మదిలోఁ గామించి హరి
చరణములను హృదయమునుంచి
వరశుకముఖ ధనమని యెంచి
ఈ సుఖమెఱుఁగని జనచెలిమి
వాసుకి విసమే మఱికొలిమి నిజ
దాసుల సంభాషణ బలిమిన్‌ ॥హ॥
నీ జపమున హృదయము వేగ
రాజిల్లను జేసిన త్యాగరాజనుతుని పేరులబాగ ॥హ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - hariyanuvaari sari yevvaree ( telugu andhra )