కీర్తనలు త్యాగరాజు హెచ్చరికగా రార హే రామచంద్ర
యదుకులకాంభోజి - జంప
పల్లవి:
హెచ్చరికగా రార హే రామచంద్ర
హెచ్చరికగా రార హే సుగుణసాంద్ర ॥హె॥
అను పల్లవి:
పచ్చవిల్తునితండ్రి పాలితసురేంద్ర ॥హె॥
కనకమయమౌ మకుటకాంతి మెఱయఁగను
ఘనమైన కుండలయుగంబు కదలఁగను
ఘనమైన నూపురయుగంబు ఘల్లనఁగ
సనకాదు లెల్లఁగని సంతసిల్లగను ॥హె॥
ఆణిముత్యాలసరు లల్లలాడఁగను
వాణీపతీంద్రు లిరువరుస పొగడగఁను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణపలుకుల వినుచు వేడ్కచెల్లగఁను ॥హె॥
నినుఁ జూడవచ్చు భగినికరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను బలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘనత్యాగరాజు కనుగొన ముద్దు గులుక ॥హె॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - hechcharikagaa raara hee raamachaMdra ( telugu andhra )