కీర్తనలు త్యాగరాజు రామచంద్ర నీ దయ రామ ఏల రాదయ
సురటి - ఆది
పల్లవి:
రామచంద్ర నీ దయ - రామ ఏల రాదయ ॥రామ॥
చరణము(లు):
కామకోటి సుందర - కరధృత మందరా
ప్రేమమీర ముందర - బిల్వ రాక యుందురా ॥రామ॥
కాననంబు తాపమో - కైక మీద కోపమో
నేను జేయు పాపమో - నీకు శక్తి లోపమో ॥రామ॥
ఆడదన్న రోసమో - అలనాడు పాసమో
మేడలేని వాసమో - మేము జేయు దోసమో ॥రామ॥
కల్లలైన నేయమా - కంటె నీకు హేయమా
తల్ల డిల్ల న్యాయమా - త్యాగరాజ గేయమా ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - rAmachaMdra nI daya - rAma ElarAdaya ( telugu andhra )