కీర్తనలు త్యాగరాజు ఎదుట నిలచితే నీదు సొమ్ము - లేమి బోవురా
శంకరాభరణము - ఆది
పల్లవి:
ఎదుట నిలచితే నీదు సొమ్ము - లేమి బోవురా ఎదుట..
అను పల్లవి:
నుదుటి వ్రాత గని మట్టు మీరను నా
తరము దెలిసి మోసపోదునా ఎదుట..
చరణము(లు):
సరాసరిగ జూతురా నా అవ - సరాల దెలియుము వరాలడుగ జా
లరా సకలదేవరాయ! మనవి వి - నరాఘహర! సుందరాకార నా ఎదుట..
విదేహజా రమణ! దేవ! బ్రోవగ - నిదే సమయ మన్యదేవతలవే
డదే మనసు తెలియదేమి రాఘవ - ఇదేటి శౌర్యము పదేపదేనా ఎదుట..
తరాన దొరకని పరాకు నాయెడ - ను రామ చేసితె సురాసురులు మె
త్తురా ఇపుడు ఈ హరామితనమే - లరా భక్త త్యాగరాజనుత! నా ఎదుట..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eduTa nilachitee nIdu sommu leemi boovuraa ( telugu andhra )