కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
30. ఈ చెట్టు నీడనే
 
ఈచెట్టు నీడనే ఇంకిపోదామోయి,
ఎందుకీ తిరిపెంపువేట?
         ఓ మామ!
ఎందాక ఈదేవులాట?
మేడకాదోయి అది; వాడకాదోయి ఇది
కటికిగుండెలు తార్చి కట్టుకొన్నా కోట!
 ఈ...
కొలుకుల్ల ప్రాణాలు ఒలికిపోయే బిడ్డ
తుదిపుల్కరింపుతో తూలిపోవక మున్నె
 ఈ...
అంతులేని దురాశ లంటుగట్టిననేల
పంట కెరువై రాలు వంతు మనదీనాడూ
 ఈ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - ii cheTTu niiDanee - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )