కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
27. మేలుకో
 
లేవరా
     నిదర
లేవరా
     మామ
లేవోయీ
     నిదరమేలు
కోవోయీ!
పకపకమని నవ్విందీ
పచ్చని పైరు,
     ఆ
పైరుమీద నీడలేవో
పాకుతున్నవి
 లేవరా...
మనకీ ఈ బూదేవికి
మద్దెనున్నదీ
     మటు
మాయదారి బూతమేదొ
మసులుతున్నదీ
 లేవరా...
మనదికాదురా ఈసిరి
మనది కాదులే
     ఈ
మంటికి జీవము పోసిన
మహరాజా లే
 లేవరా..
రక్కెసపొదవెన్క నెవరొ
నిక్కుతున్నరు;
     అటు
తక్కుతు తారుతు పొలాన
నక్కుతున్నరు
 లేవరా...
పలపలమని విరిసిందీ
పంటలచ్చిమీ;
     దాపున
కంకుల కంఠాన నేదొ
కళుకుమన్నదీ
 లేవరా...
AndhraBharati AMdhra bhArati - kavitalu - meelukoo - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )