కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి ప్రభూ!
ప్రభూ!
ఈ విషమంపు గాడ్పు టలయింపుల
        గ్రుచ్చినదండ ఛిన్నమై
పూవులు రేకు లూడిపడిపోయె
        మిగిల్చితి ప్రేమవాసనా
ప్లావితతంతు విద్ది; యురివైతువొ నామెడ
        నీ ప్రవాళ రే
ఖావరహస్తమం దభయ
        కంకణ మట్లు ధరింతువో ప్రభూ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - prabhU! - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )