కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
అతను : నేను
అతను : నేను
అతను చెడి బ్రతికే బ్రతుకు
నా బ్రతికి చెడ్డ చావు!
మగవానికి
మగువ లాగు
అనుభవానికి
తనకాయం!
ముసలి మొగుడు ఒళ్ళు
పడుచుభార్య హృదయం
నే పడలేని బాధ
ఎలుకలు
లక్ష్మీప్రదమని అతను
ఇల్లు కాల్చుకొన్న నేను!
దిగి లోతులు
తెలుసుకున్న అతను
తినకుండా
రుచులడిగే నేను
కాపురాని కాడదై
కంచంలో మెతుకు
పెడితె
ఊర్వశిలా చూచుకొని
ఉవ్విళ్ళూరే అతను
రంభైతే నేమి
రసికత చాలని
భార్యని
విస విసలాడే నేను.
అతగాడితో
మనకేల
నామాటె చెబుతాను
ఊర్ధ్వకాయం
అధోముఖం
ఆహారానికి
భూమి
విహారానికి
విహాయసం
రవి గాంచని
కోడిపిల్ల
నీ కళ్ళకు
ఆడపిల్ల!
దొరికిందా-
గ్రద్దను!
దొరకదూ?
కవిని!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - atanu : nEnu - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )