కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
రాజాజీ!
రాజాజీ!
(ఢంకా - ఏప్రిలు 1947)
వాయులీనం
నాయుడుగారు
వాయించిన
శార్వాణిరాగం
శ్యామల నిశాగమనం
    స్పందించినది
    కాలం హృదయం
    కంచుగంట
    ఒంటిగంట
    వాసన రేగెను
ఆకాశమ్మున
అగరువత్తులే
వెలిగినవి
వేనవేలు
చుక్కలు
    విహాయస
    విపినవాటుల
    విహరించె
    ఐరావతపు పంది
    అర్ధచంద్రుడు
    అందపు నా
    చందమామ
    మనలో మనమాట
    మరచితివా?
    మరచితివా?
సంధ్యా రక్తస్రావం
చీకటి లాఠీదెబ్బల
చిక్కి సగంబైనావె
స్వచ్ఛమైన నీమోము
మచ్చపడెను.
    నిశయంటే
    అసురబలం
    నీవెట్టుల
    రాజైతివి
    మన్ననలందే
    మంత్రివి
    అంతే!
సెలవిమ్మా!
కలదేమో
స్వజాతీయ
సభావేది
ధారుణికి
ముక్తి
సామ్యవాద సంస్క
రణశక్తి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - rAjAjI! - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )