బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి దీపారాధన

దీపారాధన
రక్ష రక్ష!
సంధ్య రక్ష!
సర్వ రక్ష!
దీపరక్ష!
దివ్య రక్ష!
చిన్ని నా అబ్బాయికి
శ్రీరామ రక్ష!

(దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపి,
అబ్బాయి కండ్లకు అద్దుతూ ఈ పాట పాడుతారు.)
AndhraBharati AMdhra bhArati - dIpArAdhana - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )