బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గచ్చకాయలు
గచ్చకాయలు
ఒక్కటి ఓ చెలియా,
        రెండూ రోకళ్లు;
మూడూ ముచ్చిలికా,
        నాలుగు నందన్నా;
అయిదుం బేడల్లు,
        ఆరుంజవ్వాజి;
ఏడూ యెలమంద,
        ఎనిమిది మనమంద;
తొమ్మిది తోకుచ్చు,
        పది పటనేడు.
AndhraBharati AMdhra bhArati - gachchakAyalu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )