బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ఒప్పులకుప్ప

ఒప్పులకుప్ప

ఒప్పులకుప్పా,
        ఒయ్యారిభామ!
సన్నబియ్యం,
        చాయపప్పు;
చిన్నమువ్వ,
        సన్నగాజు;
కొబ్బరి కోరు,
        బెల్లపచ్చు;
గూట్లో రూపాయి,
        నీ మొగుడు సిపాయి;
రోట్లో తవుడు,
        నీ మొగు డెవడు?
AndhraBharati AMdhra bhArati - oppulakuppa - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )