కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరాకేలనయ్య రామ
సామ - చతురశ్ర రూపక
పల్లవి:
పరాకేలనయ్య రామ
పరాత్పర నీకింత॥
అనుపల్లవి:
ధరాసుతారమణ సకల
చరాచరాధార నీకు॥
చరణము(లు):
పరమభక్తితోను నీదు స్మరణ భజన సేయలేదు
పరమదురాచారులైన నరుల జేరి మరచితి నిన్ను॥
శరణ జనాధారుడైన పరమ పురుష వాసుదేవ
నిరుపమ గుణ నీరజాక్ష వరము లొసగి బ్రోవవయ్య॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - parAkElanayya rAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )